Ramnath Kovind's Flight Halted For Three Hours Due To Technical Failure ||

2019-09-16 776

Air India One flight carrying President Ramnath Kovind detected ‘Rudder Fault’ at Zurich (Switzerland) airport yesterday, delaying the flight by around 3 hrs. The flight was scheduled to fly from Zurich to Slovenia.President Kovind is on a visit to Iceland, Switzerland & Slovenia.
#president
#flight
#aeroplane
#delhi
#foreigntour
#RamnathKovind
#Zurich
#Slovenia


భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ విదేశీ పర్యటనలో ఇబ్బందులు పడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా వన్ విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో ఆయన పర్యటన ఇబ్బందికరంగా మారింది. అయితే సాంకేతిక సేవలు అందించే సిబ్బంది అలర్ట్‌గా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. టెక్నికల్ ప్రాబ్లమ్‌ను ముందుగానే గుర్తించడంతో రాంనాథ్ కోవింద్ సేఫ్‌గా బయట పడ్డారని ఎయిర్ ఇండియా టీమ్ తెలిపింది. మూడు దేశాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి తొలుత ఐస్లాండ్ దేశంలో పర్యటించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయారు. అయితే ఆదివారం నాడు స్విట్జర్లాండ్ పర్యటన ముగిశాక స్లోవేనియా వెళ్లాల్సి ఉంది. ఆ క్రమంలో జ్యూరిచ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాంనాథ్ కోవింద్ ఇబ్బంది పడ్డారు. ఎయిర్ ఇండియా వన్ విమానం గాల్లోకి ఎగిరే సమయంలో ఆఖరి క్షణంలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది.